2027 ఫిబ్రవరిలోనే జమిలి ఎన్నికలు: రఘురామ
దేశంలో జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు. 2027 ఫిబ్రవరిలోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని ఆయన అంచనా వేశారు. అంతకు 6 నెలల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. ఏపీలో అసెంబ్లీ స్థానాలు 225కు, లోక్సభ స్థానాలు 30కు చేరే అవకాశం ఉందన్నారు. జమిలి ఎన్నికలకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చని ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు