AP: వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై పులివెందులలో కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు.