నవ్వితే నాలుగు విధాలుగా చేటు అంటారు.. కానీ ఇది నిజం కాదు. నవ్వు అనేది ఆరోగ్యానికి మంచి వ్యాయామం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ నవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, మైగ్రీన్, రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. గట్టిగా నవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. నవ్వు వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.