మందార చెట్టుతో కిడ్నీ, గుండె సమస్యలకు చెక్
ఆయుర్వేదంలో మందార మొక్కకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మొక్కలో చాలా ఔషద గుణాలు ఉన్నాయి. మందార పువ్వును పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు మందార చెట్టుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులను తింటే కిడ్నీ సమస్యలు దూరమవుతాయి. ఇంకా మందార పువ్వును తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.