సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆరే: కొండా సురేఖ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బుధవారం మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. 'హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆరే. ఈ రోజు ఓపెన్‌గా చెబుతున్నా.. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కూడా కేటీఆరే' అని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.