మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ డెడ్‌లైన్‌

60చూసినవారు
మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ డెడ్‌లైన్‌
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన ఇమేజ్ కు భంగం కలిగించాలనే ఇలా చేశారంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేసిన సురేఖ 24గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పి.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, సమంత విడాకులు తీసుకోవడానికి, బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్