నాకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'సమంత విడాకుల విషయంలో నేను చేసిన కామెంట్స్ ఉపసంహరించుకుంటూ ట్వీట్ చేశాను. కానీ.. కేటీఆర్ విషయంలో తగ్గేదేలేదు' అని స్పష్టం చేశారు. కాగా నాగచైతన్య-సమంత కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని నిన్న కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.