తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు తెలంగాణ, ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.