జమ్మూకశ్మీర్‌లో భూకంపం (వీడియో)
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. బారాముల్లా ప్రాంతంలో రాత్రి 9.06 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.