రక్త దానం చేసినట్లు నటించిన బీజేపీ మేయర్ (Video)
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత, మొరాదాబాద్ మేయర్ వినోద్ అగర్వాల్ అక్కడకు వచ్చారు. ఒక బెడ్‌పై పడుకున్న ఆయన రక్త దానం చేస్తున్నట్లు నటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేతపై విమర్శలు వెల్లువెత్తాయి. తన పరువు తీసేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారని మేయర్ ఆరోపించారు.