ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన సరిత
గట్టు పరిధిలోని నల్ల సోమనాద్రి ఎత్తిపోతల రిజర్వాయర్ పనుల పరిశీలనకు బుధవారం వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి హెల్ ప్యాడ్ వద్ద జెడ్పి మాజీ చైర్ పర్సన్, గద్వాల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సరిత తిరుపతయ్య శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.