సంక్రాంతి తర్వాత జన్మభూమి-2 ప్రొగ్రామ్
AP: చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి తర్వాత జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనికోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి పనులు, పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. కాగా, జన్మభూమి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గతంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు.