27న వైసీపీ పోరుబాట.. పోస్టర్ విడుదల

62చూసినవారు
AP: రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని... 'చంద్రబాదుడు' పాలన అని YCP నేతలు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్లు భారాన్ని మోపడం దుర్మార్గమని అన్నారు. దీనికి నిరసనగా జగన్ పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ‘వైసీపీ పోరుబాట’ చేపడుతున్నామని తెలిపారు. ఆ పోస్టర్లను ఇవాళ మాజీ మంత్రులు నాగార్జున, శ్రీనివాసరావు, జోగి రమేష్, అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్