కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

52చూసినవారు
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
AP: పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ మంగళవారం నాటికి దక్షిణ కోస్తా తీరం వైపు రానుంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్సుంది.

సంబంధిత పోస్ట్