ఓ యువకుడు కన్నతండ్రిని హత్య చేసిన సంఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు.. రాజాపూర్ మండలం రాయపల్లికి చెందిన కావలి నారాయణని అతడి కుమారుడు నందు గురువారం రాత్రి అందరూ పడుకున్నాక గొడ్డలితో తండ్రిని నరికి చంపాడు. నందుకు కొంత కాలంగా మతిస్థిమితం లేదు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడు. రోజూ నారాయణ ఇంటికి గొళ్లెం పెట్టుకునేవాడు. రాత్రి పెట్టుకోకపోవడంతో అదును చూసి చంపేయగా నందును పోలీసులు అరెస్ట్ చేశారు.