సంధ్య థియేటర్ ఘటన.. పుష్ప-2 నిర్మాతలకు ఊరట
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో 'పుష్ప-2' నిర్మాతలు రవిశంకర్, నవీన్‌కు ఊరట లభించింది. వారిని అరెస్ట్ చేయరాదంటూ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీచేశారు. మరోవైపు థియేటర్ వద్ద లాఠీఛార్జ్ ఘటనపై పోలీసులకు NHRC నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.