AP: నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో కొత్తగా భర్తీ చేయాల్సిన 866 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం 18 నోటిఫికేషన్లు విడుదల చేయనుండగా.. అటవీ శాఖలోనే 814 పోస్టులున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగానే ఈ నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చంద్రబాబు సర్కార్ తెలిపింది.