రైతుల అకౌంట్లో రూ.20 వేలు.. ప్రభుత్వం కీలక ప్రకటన
AP: అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేలు అందిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దీనిపై తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. రూ.20 వేలలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.14 వేలు, కేంద్రం వాటా రూ.6 వేలు ఉంటుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 41.4 లక్షల రైతులు అర్హులని, బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించామన్నారు. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.20 వేలు జమ చేస్తామని మంత్రి అచ్చెన్న వెల్లడించారు.