బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వాను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ఈ కుట్రతో సంబంధం ఉన్న ఐదుగురు అధికారులను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు మిలిటరీ అధికారులు, ఒక పోలీసు అధికారి ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కూడా ప్లాన్లు వేశారని పోలీసులు తెలిపారు. ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా హత్య చేసేందుకు వారు కుట్ర పన్నారని అధికారులు తెలిపారు.