చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు: హోంమంత్రి అనిత
AP: సాంకేతికంగా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. నాలుగు నెలల కాలంలో సాధించిన పురోగతిపై పోలీస్ అధికారులతో చర్చించారు. రెడ్‌బుక్‌లో తమ పేర్లు ఉన్నాయని వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవు’’ అని హోం మంత్రి స్పష్టం చేశారు.