టోపీ విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ను కాల్చి చంపారు (వీడియో)

66చూసినవారు
ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తలకు పెట్టుకునే టోపీ విషయంలో చిన్న గొడవ జరగడంతో ఏకంగా ముగ్గరు వ్యక్తులు తమ స్నేహితుడిని తుపాకీతో కాల్చారు. పిసిఆర్ కాల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని సుఫియాన్‌ (20)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్