రైల్వే ప్రయాణికులకు శుభవార్త
రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బోగీల ద్వారా రోజూ లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని పేర్కొంది. పలు రైళ్లకు ఇప్పటికే 583 జనరల్ కోచ్‌లను అమర్చగా.. మిగతా రైళ్లకు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపింది. రాబోయే రెండేళ్లలో 10 వేల నాన్-ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని పేర్కొంది.