రెయిన్ సాంగ్.. చిరంజీవి గ్రేస్ చూసి భయం పుట్టింది: నాగార్జున
చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి కాస్త టెన్షన్ పడ్డానని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన ANR జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘నేను సినిమాల్లోకి రావాలనుకునే సమయంలో నాన్న నన్ను పిలిచి ‘చిరంజీవి అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు వెళ్లి చూడు అన్నారు. అది రెయిన్ సాంగ్. ఈయనలాగా మనం డ్యాన్స్ చేయగలుతామా అని అనిపించింది. సినిమా కాకుండా మరో దారి వెతుక్కుందాం అనుకుంటూ బయటకు వచ్చేశా’’ అని నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.