కోడేరులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి జూపల్లి

72చూసినవారు
కోడేరులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి జూపల్లి
కొల్లాపూర్ నియోజకవర్గం కోడేర్ మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులు కలిసి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్