ఆ ముగ్గురు తెలుగు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా: డైరెక్టర్ శంకర్

62చూసినవారు
ఆ ముగ్గురు తెలుగు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా: డైరెక్టర్ శంకర్
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా జంటగా తెరకెక్కిన 'గేమ్‌ ఛేంజర్‌' సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా యూఎస్‌ఎలోని డల్లాస్‌లో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. 'తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. తెలుగులో నా తొలి సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. అయినా మీరు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు. చిరంజీవి, ప్రభాస్‌ మహేష్ బాబులతో కరోనా సినిమాలు చేద్దామని ప్రయత్నించా. కానీ కుదరలేదు.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్