హోటల్లో ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్న యువకులు (వీడియో)
యూపీలోని బిజ్నోర్లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. కొందరు యువకులు ఓ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ వారి మధ్య చిన్న వివాదం కారణంగా ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. ఈ గొడవలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.