షుగర్ పేషెంట్లకు దొండకాయలు వరమనే చెప్పవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజూ పరగడుపునే దొండకాయలతో జ్యూస్ తయారు చేసి తాగుతుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. దొండకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.