రూ.299కే రూ.10 లక్షల బీమా
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ కింద తక్కువ ప్రీమియంలకే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోంది. రూ.299తో పాలసీ తీసుకుంటే ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యం ఏర్పడినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షల బీమా లభిస్తుంది. 18-65 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఆత్మహత్య, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ మరణాలకు ఈ ఇన్సూరెన్స్ లభించదు. వివరాలకు https://www.ippbonline.com/web/ippb/tagic-group-accident-insurance వెబ్సైట్ను సందర్శించండి.