AP: ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కృష్ణా జిల్లా పెనమలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. తేమ, ఇతర అంశాల్లో కచ్చితత్వం ఉండాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని, తానే స్వయంగా ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల అభిప్రాయాలను సేకరిస్తానని చెప్పారు. ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు.