బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించండి: చంద్రబాబుకు పవన్ విజ్ఞప్తి
కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ముప్పు వాటిల్లేలా ఈ స్మగ్లింగ్ సాగిందని ఆయనకు వివరించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు రెండు గంటల పాటు పవన్ భేటీ అయ్యారు. కాకినాడ కేంద్రంగా విదేశాలకు బియ్యం అక్రమ రవాణా అంశంపై ప్రధానంగా చర్చించారు.