శీతాకాల విడిది.. హైదరాబాద్‌కు రాష్ట్రపతి

56చూసినవారు
శీతాకాల విడిది.. హైదరాబాద్‌కు రాష్ట్రపతి
శీతాకాల విడిదికి హైదరాబాద్‌లో ఉన్న బొల్లారంలోని నిలయానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి 21 వరకు 6 రోజుల పాటు ఆమె HYDలో ఉండనున్నారు. అలాగే ఈ నెల 21న తెలంగాణలో శీతాకాల విడిది ముగించుకొని, నేరుగా ఏపీకి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి రాకతో నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.