ప్రయాగ్ రాజ్లోనే మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారంటే..?
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహా కుంభమేళా మొదలవుతుంది. భూమిపైన ఒక ఏడాది అయితే.. అది దేవతలకు ఒకరోజుతో సమానం. పురాతన కాలంలో దేవతలకు, రాక్షసులకు మధ్య 12 సంవత్సరాల పాటు ఘోరంగా యుద్ధం జరిగిందట. దానికి నిదర్శనంగా పన్నెండేళ్లకోసారి పూర్ణకుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే.. భూమిపై 144 సంవత్సరాలకు సమానం అవుతుంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం కావడంతో మహా కుంభమేళా మాత్రం కేవలం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు.