కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊరట
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన జానీకి అక్టోబర్ 24న హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.