పెళ్లి వేడుకకు ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ఘనంగా చేసుకోవడానికే అందరూ ఇష్టపడతారు. కొందరు బాగా డబ్బున్న వ్యక్తులు తమ పెళ్లి రోజున కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతుంటారు. అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ మండపానికి ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో వరుడు తన చేతిలో ఉన్న రూ. 20 లక్షల విలువైన నోట్లను విసిరాడు. జనాలు ఆ నోట్లను తీసుకోవడానికి పోటీ పడ్డారు.