నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. అంతకుముందు ఈవీఎం గోదామును అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలం ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు తెరవగా ఈవీఎం గోదాముకు వచ్చిన కలెక్టర్ గోదాంలో గల బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీపాట్ బాక్సులను పరిశీలించారు. గోదాముల వద్ద ఎల్లప్పుడూ భద్రత ఉండాలని అన్నారు.