దన్వాడ మండలంలో శనివారం పాఠశాలల బంద్ విజయవంతం అయిందని పీడీఎస్‌యూ మండల అధ్యక్షుడు మహేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసిస్తూ ప్రభుత్వ పాఠశాలలు బంద్ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.