Top 10 viral news 🔥
EXIT POLLS: మహారాష్ట్రలో అధికారం బీజేపీ కూటమిదే
మహారాష్ట్రలో ‘మహాయుతి‘ కూటమి(బీజేపీ) మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 288 సీట్లకు గానూ ఈ కూటమి 175-196 గెలుచుకుంటుందని తెలిపింది. ఇక కాంగ్రెస్, NCP(SP), శివసేన యూబీటీ కూటమి (మహా వికాస్ అఘాఢీ)కి 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది. సొంతంగా BJPకి 113, శివసేనకు 52, NCPకి 17 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకు 27 సీట్లు వస్తాయని అంచనా వేసింది.