మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోనే మృతి చెందాడు. బీడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బాలాసాహెబ్ షిండే.. ఛత్రపతి షాహూ విద్యాలయ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.