ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణంగా హత్య చేసిన దుండగుడు
TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలోని షమా కాలనీకి చెందిన సైఫ్ అలియాస్ సాబెర్ అనే వ్యక్తి దగ్గరి బంధువైన ఇస్మాయిల్‌కు రూ. 2 లక్షల అప్పు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమని అడిగినందుకు సైఫ్‌ను ఇస్మాయిల్ ఆదివారం తలపై బండ రాయితో మోది హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.