TG: కార్తీక మాసం నేపథ్యంలో యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.