పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రూ.788 కోట్లు విడుదల
AP: విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 6.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రూ.788 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉంచిన బకాయిలను తాము చెల్లిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పేర్కొంది.