తిరుమల తొక్కిసలాట మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

67చూసినవారు
AP: తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కులను హోం మంత్రి అనిత, పళ్ళ శ్రీనివాస్, విష్ణు కుమార్‌రాజు, చిరంజీవిరావు ఇవాళ పంపిణీ చేశారు. చనిపోయిన తమవారిని తలుచుకుని బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు పెట్టుకోగా.. వారిని హోంమంత్రి అనిత ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున రూ.25 లక్షలు, బోర్డు సభ్యుల తరపున రూ.2.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్