ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప-2: ది రూల్’ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్-10 నటుల జాబితాను ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ రూ.300 కోట్లతో ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా మొదటి స్థానంలో నిలిచారు. ‘పుష్ప2’ కోసం ఆయన ఈ పారితోషికం అందుకున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది.