నారాయణపేట: బెట్టింగ్ యాప్ లకు యువత దూరంగా ఉండాలి

57చూసినవారు
నారాయణపేట: బెట్టింగ్ యాప్ లకు యువత దూరంగా ఉండాలి
యువకులు బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లకు దూరంగా వుండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. సులువుగా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశకు పోతే ప్రాణాల మీదకు వస్తుందని మంగళవారం అన్నారు. మోసపూరిత ప్రకటనలు నమ్మి నష్టపోవద్దని సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేసే వివరాలు పోలీసులకు అందించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్