మహిళల కోసం పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ పథకం 2023 ఏప్రిల్ 1న అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్కీమ్ 2025 మార్చి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ 7.5% వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. ఇందులో రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఏడాది తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 40% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీస్‌ను సంప్రదించగలరు.