

ఏపీలో వారికి రూ.20 వేల సాయం (వీడియో)
అన్నదాత సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన రైతు సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ. 20,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో మూడు విడతల్లో జమ చేస్తారు. ఇందులో రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం (PM-KISAN), రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ సాయం విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.