వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం 16, 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా. గురువారం సాయంత్రానికి 15, 500క్యూసెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్లను కొనసాగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 15, 120 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. మొత్తం ప్రాజెక్టు నుంచి వివిధ రూపాల్లో 19, 252 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.