TG: విద్యార్థి సూసైడ్.. 'నారాయణ' ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టారు!
మేడ్చల్(D) అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో విద్యార్థి తనూష్ (16) సూసైడ్ వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. కుమారుడిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు.. కాలేజీ గేట్ తాళం విరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. కోపంతో రగిలిపోయిన వారు, మీ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నాడని ప్రిన్సిపల్ రామ్ రెడ్డిని పరిగెత్తించి కొట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.