విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్‌కు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది రెండు దశల్లో నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. తొలి దశలో మొత్తంగా 38.4కి.మీ మేర.. గన్నవరం నుంచి బస్‌స్టాండ్ వరకు కారిడార్ 1A, బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు కారిడార్ 1B నిర్మాణం చేపట్టనుంది. రెండో దశలో బస్టాండ్ నుంచి అమరావతి వరకు దాదాపు 27.75కి.మీల మేర కారిడార్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.