ఏపీలోని పట్టణాల్లోనూ ఇంటింటికీ కుళాయి
AP: గ్రామాల్లో జల్జీవన్ మిషన్ తరహాలో పట్టణాల్లోనూ ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన రూ.13,468 కోట్ల తాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు పూర్తికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో 15.30 లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చి రక్షిత నీరందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. పెండింగ్ పనులు పూర్తయిన వెంటనే పనులు చేపట్టనున్నారు.